పవన్ కోసం కథల వేట.. మొత్తం 7! - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

పవన్ కోసం కథల వేట.. మొత్తం 7!


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు నిర్మాతలు భారీ స్థాయిలో అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక పవన్ కూడా ప్లాన్ ప్రకారమే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నాడు. ఒకవైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలని బాగానే ట్రై చేస్తున్నారు.

ఇక ఇప్పటికే అఫీషియల్ 5 సినిమాలు క్యూలో ఉండగా త్రివిక్రమ్ తో ఒక సినిమా అనుకుంటున్నట్లు మొన్న ఒక టాక్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు మరొక ప్రొడక్షన్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జే భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా బేబి ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు టాక్. ఇక పవన్ ఒప్పుకోగానే నిర్మాతలు కథ కోసం వేట మొదలు పెట్టినట్లు టాక్. ఎక్కువగా యువ దర్శకులనే సంప్రదించమని పవన్ సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే కథ నచ్చితేనే చేస్తానని పవన్ ముందే క్లారిటీ ఇచ్చారట. సెట్టయితే వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావచ్చని సమాచారం.