Subscribe Us

Pawan Kalyan Health Update!!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ విషయం తెలియగానే జన సైనికులు ప్రతి రోజు దైవ ప్రార్ధనలతో ఆయన త్వరగా కోలుకోవాలని అనుకున్నారు. మొత్తానికి అభిమానుల నమ్మకంతో ఆయన కోవిడ్ నుంచి బయట పడినప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో సెట్టవ్వలేదని తెలుస్తోంది.

కొంత వీక్ నెస్ తో బాధ పడుతున్నట్లు సమాచారం. ఇక వైద్యులు  మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. దీంతో పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన రెండు సినిమాల షెడ్యూల్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అయ్యప్పనుమ్ కొశీయుమ్, అలాగే హరిహర వీరమల్లు షెడ్యూల్స్ వాయిదా పడ్డట్లు సమాచారం. చిత్ర నిర్మాతలు కూడా కరోనా మళ్ళీ తగ్గిన తరువాతే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


Post a Comment

0 Comments