మరో 'దండాలయ్యా'...RRR ఎమోషనల్ సాంగ్!!


బాహుబలి సినిమాలో అన్ని పాటలు ఒక ఎత్తైతే.. దండాలయ్యా సాంగ్ మరొక ఎత్తు. కీరవాణి సంగీతంలో కాల బైరావ పాడిన ఆ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందులోనే ఎమోషన్ ప్లస్ రాజసాన్ని చూపించిన విధానం సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక RRR లో అంతకు మించి అనేలా తండ్రి కొడుకులు మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాల బైరావ గాత్రంలోనే RRR లో కూడా హేవి ఎమోషనల్ సాంగ్ ఉంటుందట. జనాలు అందరూ చూస్తుండగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బ్రిటిష్ జైల్లో ఉంటారట. ఇక ఆ సమయంలోనే కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే కాల బైరావ గానం ప్రేక్షకుల మనసును కదిలించడం కాయమని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో RRR యాక్టర్ ప్రశాంత్ వివరణ ఇచ్చారు. అతను ఎన్టీఆర్ గ్యాంగ్ లో సహా నటుడిగా నటించినట్లు చెప్పారు.


Post a Comment

Previous Post Next Post