స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా సెట్టవ్వాలని బాగానే కష్టపడుతున్నాడు. అతను హార్డ్ వర్క్ చేసిన ప్రతి సారి కూడా ఏదో ఒక విధంగా సక్సెస్ అవుతున్నాడు. పుష్ప సినిమాతో తప్పకుండా హిట్ కొట్టగలడని సుకుమార్ మాటలు వింటేనే అర్థమవుతోంది. అయితే ఈ స్టార్ హీరో ప్రస్తుతం మొత్తం 6 సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
మొదట పుష్ప రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇక కొరటాల శివతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉండగా ఆయన ఎన్టీఆర్ వద్దకు వెళ్లడంతో వాయిదా పడింది. ఆ సినిమా ఎప్పుడైనా సెట్స్ పైకి రావాల్సిందే. వేణు శ్రీరామ్ ఐకాన్ స్టోరీ అయితే సెట్టయ్యింది. ఆ సినిమా ఉంటుందని దిల్ రాజు ఓ మాట అయితే చెప్పేశాడు. ఇక బోయపాటి దర్శకత్వంలో కొత్త కథపై చర్చలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ తో కూడా మీటింగ్స్ జరిగాయి కాబట్టి అల్లు అర్జున్ ఈ సినిమాలకు ఓకే చెబితే గ్యాప్ లేకుండా ఒకదాని తరువాత మరొకటి వెంటవెంటనే అరడజను సినిమాలు వస్తాయని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment