Kalyan Ram 'Bimbisara' to release in 3 parts?


నందమూరి హీరోల్లో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో క్రేజ్ అందుకున్నాడు. ఇక బాలకృష్ణ ఆయన స్టైల్ లో రిజల్ట్ తో సంభంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఇంకా అనుకున్నంత రేంజ్ లో హిట్ అందుకోలేదు. ఇక ఈసారి ఒక హిస్టారికల్ సోషియో ఫాంటసీ కథతో రాబోతున్నాడు.

వశిష్ట్ అనే ఒక కొత్త దర్శకుడితో చేయబోతున్న బిగ్ బడ్జెట్ సినిమాలో కళ్యాణ్ రామ్ నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడు. ఇక ఆ సినిమాను మూడు భాగాలుగా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయినట్లు టాక్ వస్తోంది. ఇప్పటివరకు రెండు భాగాలతో మాత్రమే సినిమాలు వచ్చాయి. మరికొన్ని అలానే వస్తున్నాయి. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం 3 పార్ట్స్ ప్లాన్ తో ఉండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంలో క్లారిటి రావాలి అంటే శుక్రవారం వరకు వేయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజు 12గంటలకు సినిమాకి సంబంధించిన పూర్తి విషయాల గురించి వివరణ ఇవ్వనున్నారు.


Post a Comment

Previous Post Next Post