మెగాస్టార్ డేరింగ్ స్టెప్.. జెట్ స్పీడ్ ప్లాన్!


మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అంచనాలు గట్టిగానే పెరిగాయి. దర్శకుడు కొరటాల శివ కూడా కమర్షియల్ హంగులతోనే సినిమాను డిజైన్ చేస్తున్నాడు.

ఇక కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే సినిమా షూటింగ్ ఈపాటికే అయిపోయి ఉండేది. ఇక ఇటీవల మెగాస్టార్ దర్శకుడితో మాట్లాడి ఒక షెడ్యూల్ ప్లాన్ సెట్ చేసినట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం జూలైలోనే మిగిలిన సీన్స్ ను మొత్తం సింగిల్ షెడ్యూల్ లోనే ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారాట. నెల రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులను 20 రోజుల్లోనే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. అంటే మెగాస్టార్ ఈ వయసులో అది కూడా కోవిడ్ ఎక్కువవుతున్న తరుణంలో ఇలాంటి జెట్ స్పీడ్ ప్లాన్ సెట్ చేసుకున్నారు అంటే డేరింగ్ అనే చెప్పాలి. ఇక రిలీజ్ ఎప్పుడనేది మాత్రం కోవిడ్ పరిస్థితిని బట్టి ఆగస్ట్ తరువాత ఆలోచిస్తారట.


Post a Comment

Previous Post Next Post