వెబ్ సిరీస్ గొడవలో సమంత.. నాగ్ సింపుల్ రియాక్షన్! - TollywoodBoxoffice.in

Exclusive Portal for Boxoffice Collections

వెబ్ సిరీస్ గొడవలో సమంత.. నాగ్ సింపుల్ రియాక్షన్!


నాగార్జున చాలా వరకు ఎలాంటి గొడవలు ఎదురైనా కూడా సింపుల్ గా పరిష్కరించడానికి ట్రై చేస్తారు. ఎక్కువగా బిజినెస్ మైండ్ తో ఆలోచించే నాగ్ వీలైనంత వరకు వివాదాలకు దూరంగానే ఉంటాడు. ఇక ఇటీవల సమంత ద ఫ్యామిలీ మ్యాన్  వివాదంలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

తమిళ టైగర్స్ ను అవమానించే విధంగా సమంత పాత్రను హైలెట్ చేశారాని ఎన్నో విమర్శలు వచ్చాయి. తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆ వివాదంపై స్పందించి విషయాన్ని సెంట్రల్ వరకు వెళ్లింది. అయితే ఈ విషయంపై దర్శకులు ఇతర నటీనటులు స్పందిస్తునప్పటికీ సమంత అస్సలు టచ్ చేయడం లేదు. అందుకు కారణం నాగార్జున అని తెలుస్తోంది. ఆ వివాదంపై స్పంధించడం కంటే కూడా సైలెంట్ గా ఉండడమే బెటర్ అని నాగార్జున తన కోడలికి సలహా ఇచ్చారట. అందుకే సమంత కూల్ గా ఉన్నట్లు సమాచారం.