తరుణ్.. చివరికి డబ్బింగ్ ఆర్టిస్టుగా


బాలనటుడిగా ఒకప్పుడు మంచి గుర్తింపు అందుకున్న తరుణ్ వయసులోకి రాగానే నువ్వే కావాలి సినిమాతో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తరువాత నువ్వే నువ్వే అంటూ ఎన్నో యూత్ ఫుల్ లవ్ స్టోరిలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతని బ్యాడ్ లక్ ఏమిటో గాని సక్సెస్ ఎక్కువ కాలం కొనసాగలేదు. వరుసగా అపజయాలు వచ్చాయి.

చివరగా చేసిన 'ఇది నా లవ్ స్టొరీ' అయితే ఊహించని దెబ్బ కొట్టింది. ఇక దాంతో సినిమాలను పక్కన పెట్టి హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇక చాలా రోజుల అనంతరం ఒక మళయాళం సినిమాకు డబ్బింగ్ చెప్పి ఆకట్టుకోవడం విశేషం.
ఆహా’ ఓటీటీలో రిలీజైన ‘అనుకోని అతిథి’ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. రెండేళ్ల క్రితం మళయాళం హిట్టయిన ‘అతిరన్’ సినిమాను తెలుగులో అనుకోని అతిధిగా విడుదల చేశారు. అందులో తరుణ్ డబ్బింగ్ చాలా బావుంది. రేంజ్ ఎక్కువ తక్కువ అనే విషయాలని పక్కన పెడితే ఒక నటుడిగా తరుణ్ కు సినిమాపై ఉన్న మక్కువ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. మరి భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post