మెగాస్టార్ చిరంజీవి కరోనా కారణంగా మళ్ళీ కాస్త స్లో అయిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ హడావుడి లేకపోయి ఉంటే ఈపాటికే ఆచార్య సందడి మొదలయ్యేది. ఇక మరొక సినిమా కూడా విడుదలకు రెడీగా ఉండేది. వీలైనంత తోందరాగా మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ ను స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు.
ఇక జూలై అనంతరం పరిస్థితులు అనుకూలిస్తే ఫాస్ట్ గా లూసిఫర్ షూటింగ్ పనులను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక టైటిల్ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 'కింగ్ మేకర్' అనే టైటిల్ కథకు కరెక్ట్ గా సెట్టవుతుందని అనుకుంటున్నారట. ఇక హీరోయిన్స్ గా ఇంతకుముందు నయనతార - కీర్తి సురేష్ అనే పేర్లు గట్టిగానే వినిపించాయి. కానీ దర్శకుడు మళ్ళీ ఆ ఆలోచనలు మార్చుకున్నట్లు సమాచారం. మరొక స్టార్ హీరోయిన్ ను ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment