మరోసారి జత కట్టిన ఉప్పెన జోడి!


ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. సుకుమార్ చెప్పినట్లుగానే సినిమా అన్ని రకాలుగా 100కోట్ల బిజినెస్ చేసి ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. సినిమా ఊహించని విధంగా భారీ వసూళ్లను అందుకోవడంతో హీరో హీరోయిన్ డైరెక్టర్.. అందరికి మంచి బూస్ట్ వచ్చినట్లయ్యింది.


ముఖ్యంగా ఉప్పెన జోడి వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి అభిమానులకు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఇక ఈ ఇద్దరు కూడా మరో సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే వీరు వెబ్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో దర్శనమివ్వబోతున్నారు. రానా దగ్గుబాటి హోస్ట్ గా చేస్తున్న నెంబర్ 1 యారి షోలో ఈ ఇద్దరు సందడి చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరి ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ కలయికతో ఎంతగా క్రేజ్ అందుకుంటారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post