బాలయ్య మళ్ళీ తొడకోట్టి కత్తి పడితే..!!


క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని నెక్స్ట్ బాలయ్యతో కూడా అదే తరహాలో ఒక హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఆ సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉండాలని దర్శకుడు ఇప్పటికే రియల్ ఫ్యాక్షన్ కథలపై సెర్చ్ చేశాడు, 100ఏళ్ల చరిత్ర కలిగిన పాత లైబ్రరీలను కూడా సందర్శించాడు. 

బాలకృష్ణ మళ్ళీ చాలా కాలం తరువాత వింటేజ్ ఫ్యాక్షన్ పాత్రలో చూపిస్తారట. నరసింహా నాయుడు , చెన్నకేషవ రెడ్డి లాంటి హై వోల్టేజ్ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాక్షన్ డ్రాప్ లో యాక్షన్ కథలు వచ్చి చాలా కాలమయ్యింది. ఇక గోపిచంద్ మలినేని ఇప్పటికే క్రాక్ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. కాబట్టి బాలకృష్ణ ప్రాజెక్టు విషయంలో కూడా హై లెవెల్లోనే ఆలోచిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post