Subscribe Us

Update on Seetimaar OTT Release!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ దెబ్బకు కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని చాలా మంది నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల వల్ల డిజిటల్ ఆఫర్స్ కు తలొగ్గక తప్పట్లేదు. అయితే అన్ని సినిమాలు ఓటీటీలో సక్సెస్ అవ్వవని ఇటీవల జాతిరత్నాలు డిజాస్టర్ తో అర్ధమయ్యింది.

ఇక గోపిచంద్ - తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కిన సీటిమార్ ఓటీటీలో విడుదలకి సిద్ధమైనట్లు టాక్ వస్తోంది. పలు వెబ్ మిడియాలు కూడా జోరుగా వార్తలు ప్రచారం చేస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమా బిగ్ స్క్రీన్ పై చూస్తేనే బావుంటుందని చిత్ర దర్శకుడు సంపత్ నంది ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఎలాగైనా థియేటర్స్ ఓపెన్ అయ్యాకే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే.


Post a Comment

0 Comments