Subscribe Us

Anushka-Naveen Polishetty Movie Update!!


జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం ఆఫర్స్ అయితే గట్టిగానే అందుకుంటున్నాడు. అయితే తొందరపడకుండా కేవలం విభిన్నమైన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇక ఇప్పటికే అనుష్కతో ఒక రొమాంటిక్ సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తెరకెక్కించబోయే ఆ సినిమాను మే నెలలోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎక్కువవ్వడంతో ప్లాన్ మొత్తం చేంజ్ అయ్యింది. ఇక మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి అంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఆగస్ట్ లో లేదా ఆ తరువాత పరిస్థితులను బట్టి షూటింగ్ ను స్టార్ట్ చేయవచ్చని సమాచారం.


Post a Comment

0 Comments