బాలయ్యతో ఇద్దరు దర్శకులు.. క్లారిటీ వచ్చేది ఆ రోజే!


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఆ సినిమాల అనంతరం బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడనేది ఇంకా అఫీషియల్ గా అయితే క్లారిటీ ఇవ్వలేదు.

దర్శకుల వైపు నుంచి అయితే ఒక క్లారిటీ వచ్చింది. క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని ఇప్పటికే కథను సెట్ చేసుకునే పనిలో బిజీ అయ్యాడు. మరోవైపు అనిల్ రావిపూడి కూడా బాలయ్య సినిమా తప్పకుండా ఉంటుందని అన్నాడు. ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ఒక క్లారిటీ అయితే ఇవ్వనున్నారట. అలాగే అఖండ నుంచి కూడా ఒక హై వోల్టేజ్ పోస్టర్ రానున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post