దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా బడ్జెట్ అనేది మొదటి నుంచి అంతకంతకు పెరుగుతూనే వస్తోంది. అయితే బాహుబలి అనంతరం జక్కన్న ఆలోచనలు మరింత పెద్దవవుతున్నాయి. RRR సినిమా బడ్జెట్ 400కోట్లని నిర్మాత దానయ్య ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చారు.
అయితే ఆ బడ్జెట్ లో సగం రాజమౌళికి కూడా పాట్నర్షిప్ లేకుండా ఉండదు. ఇక మహేష్ బాబుతో చేయబోయే సినిమాను కెఎల్.నారాయణతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా బడ్జెట్ RRR కంటే హై రేంజ్ లో ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. 500కోట్లకు పైగానే ఖర్చు చేయవచ్చని టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని జక్కన్న బడ్జెట్ విషయంలో మాత్రం ఈసారి కూడా అస్సలు తగ్గేలా లేడని అర్ధమవుతోంది. ఇక ఆ సినిమా ఈ ఏడాది తుది దశలోనే లాంచ్ కావచ్చని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment