షాక్ ఇస్తున్న నిఖిల్ లైనప్.. చేతిలో 5 సినిమాలు!


యువ హీరో నిఖిల్ సిద్దార్థ ఈ మధ్య కోవిడ్ బాధితుల కోసం తనవంతు సహాయలు చేస్తూ జనాలకు మరింత దగ్గరయ్యాడు. తనకు తోచినంత సహాయలు అందిస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇక ఈ హీరో మంచితనానికి తగ్గట్లుగానే మంచి మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. రానున్న రోజుల్లో నిఖిల్ కెరీర్ మరో యూ టర్న్ తీసుకోవడం కాయమని చెప్పవచ్చు.

సుకుమార్ రైటింగ్స్ లో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే కార్తికేయ 2 సెట్స్ పైనే ఉంది. స్వామిరారా సీక్వెల్ స్క్రిప్ట్ కూడా రెడీ. అయితే ఈ సినిమాల అనంతరం ఒక కొత్త దర్శకుడితో స్పై థ్రిల్లర్ సినిమాను కూడా చేయనున్నాడు. అలాగే ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఈ విధంగా విభిన్నమైన కథలను సెట్ చేసుకుంటూ నిఖిల్ మంచి ట్రాక్ సెట్ చేసుకుంటున్నాడు.


Post a Comment

Previous Post Next Post