సుకుమార్ భార్య కూడా సినిమాల్లోకి..!


అగ్ర దర్శకుడిగా ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సుకుమర్ త్వరలోనే పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకోవడం కాయం. కేవలం తను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఏదో ఒక విధంగా సక్సెస్ కావాలని అనుకునే సుకుమార్ సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ను  స్థాపించి అందులోనే తన స్టూడెంట్ కు అవకశాలు ఇప్పిస్తున్నాడు.

అయితే మొదట సుకుమార్ రైటింగ్స్ వ్యవహారం మొత్తం అతని స్నేహితుదైన ప్రసాద్ చేతుల్లోనే ఉండేది. మేనేజర్ గా ఉంటూ అన్ని పనులు తనే చూసుకునేవాడు. కానీ అతను ఇటీవల మరణించడంతో ఆ బాధ్యతలను సుకుమార్ భార్య తాబితా బండ్రెడ్డి చూసుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్ లో స్క్రిప్ట్ పనుల నుంచి ప్రొడక్షన్ పనుల వరకు మొత్తం కూడా ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు సమాచారం. ప్రొడక్షన్ హౌజ్ భార్య చేతుల్లోకి వచ్చిన తరువాత సుక్కు హ్యాపీగా పుష్ప పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post