కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల చేసింది తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ అయితే సెట్ చేసుకున్నాడు. అయితే అతని తొందరపాటు వలన బ్రహ్మోత్సవం సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత కొన్నాళ్ళు అతనికి ఎక్కడా ఛాన్స్ దక్కలేదు.
కొంతకాలం గీత ఆర్ట్స్ లోనే స్క్రిప్ట్ సెలక్షన్ లలో పాల్గొంటు వచ్చాడు. ఆ సంస్థ ఒక ఆఫర్ ఇవ్వడంతొ ముందే అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు అతని భవిష్యత్తు మొత్తం నారప్ప పైనే ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్టయితే నిర్మాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఇప్పిస్తానని ముందే చెప్పాడట. తప్పకుండా నారప్ప హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్న శ్రీకాంత్ పవన్ కోసం కథ కూడా సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే గీత ఆర్ట్స్ లో కమిట్మెంట్ ఉంది కాబట్టి దిల్ రాజు ఏదైనా సెటిల్మెంట్ చేస్తేనే ఆ సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. మరి శ్రీకాంత్ అడ్డాల లక్కు ఎలా టర్న్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment