కథ:
భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూలు జిల్లాలో సబ్ ఇన్‌స్పెక్టర్. అతను చాలా నిజాయితీగా డ్యూటీ చేస్తుంటాడు. అయితే ఒక రోజు డేనియల్ ‘డానీ’ శేఖర్ (రానా దగ్గుబాటి)ని మద్యం బాటిళ్లను రవాణా చేస్తుండగా పట్టుకుంటాడు. దీంతో డానీ యొక్క అహం దెబ్బతింటుంది. ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణల వరకు వెళుతుంది. అహంకారం, ఆత్మగౌరవం మధ్య కోపాలు వేడెక్కుతాయి. ఇక భీమ్లా నాయక్‌పై తన ప్రతీకారం తీర్చుకోవడానికి డానీ ఎలా ప్రయత్నించాడు? డానీకి నాయక్ ఎలాంటి సమాధానం చెప్పాడు అనేది మిగతా కథ.
విశ్లేషణ:
అయ్యారే అప్పట్లో ఒక్కడుండేవాడు సినిమాలను డైరెక్ట్ చేసిన సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ దర్శకత్వం వహించాడు. అతన్ని ఎక్కువగా నమ్మింది త్రివిక్రమ్ మాత్రమే. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి అధికారిక రీమేక్ ను కమర్షియల్ గా హైలెట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అలాగే అనేక రకాల సలహాలతో సాగర్ సినిమాకు కావాల్సిన అంశాలను హైలెట్ చేసి ఒక న్యాయం అయితే చేశాడు.
భీమ్లా నాయక్ మేయిన్ ప్లాట్ వచ్చేసి.. సంకల్పం ఉన్న వ్యక్తుల మధ్యలో కొనసాగే అహం ఘర్షణ. ఆత్మ గౌరవాన్ని అహంకారానికి మధ్యలో ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్ గా కనిపించే కథ. ఇక భీమ్లా నాయక్ సినిమాలో చాలా అంశాలు ఒరిజినల్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ కంటే డిఫరెంట్ గా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే కరెక్ట్ గానే వర్కౌట్ అయ్యింది. ఒరిజినల్ క్యారెక్టర్ బిజూ మీనన్ సైలెంట్ గా ఉండే అగ్నిపర్వతంలా కనిపించగా పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పాత్రలో మొదటి నుంచే మెరుపులా కనిపించాడు. ఒక విధంగా అతని బాడీ లాంగ్వేజ్ కు అదే కరెక్ట్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా త్రివిక్రమ్ అందించిన మాటలు కూడా హైలెట్ గా నిలిచాయి.
మాస్ అభిమానులకు నచ్చే విధంగా పవన్ కల్యాణ్ ప్రతీ సన్నివేశంలో మాస్ అప్పీల్ విజిల్స్ వేయించేలా ఉన్నాయి. దానికి తోడు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ పలు సీన్స్ లో హీరో ఎలివేషన్స్ సక్సెస్ అవ్వడానికి మరొక కారణం రానా దగ్గుబాటి అని చెప్పాలి. అతను కీలకమైన సీన్స్ లో అలా నటించకపోతే పవన్ క్యారెక్టర్ అంతగా హైలెట్ అయ్యేది కాదు. సెకండాఫ్‌లో చేసిన మార్పులు ఒరిజినల్ స్క్రిప్ట్‌లోని బ్రిలియెన్స్‌కు భిన్నంగా కనిపించవచ్చు. అయితే ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే మాస్ అంశాలతో నిండి ఉంది.
ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ భారీ ఫ్లాష్‌బ్యాక్ మరొక మేజర్ ప్లస్ పాయింట్. ఆకర్షణీయమైన కథను చెప్పడం కంటే మాస్ జనాలను ఆకట్టుకునే భావోద్వేగాలను ఎలివేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అభిమానులకు మద్ ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఇక పలు సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ అతని పాత సినిమాలలో బద్రీ రోజులను గుర్తు చేస్తుంది. అలాగని రానా పాత్రను ఏ మాత్రం తగ్గించలేదు. అతని పాత్రను కూడా బ్యాలెన్స్ డ్ గానే కొనసాగించారు. ముఖ్యంగా డైలాగ్స్ స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ లో మరీ యాక్షన్ డోస్ ఎక్కువయ్యిందని అనిపించవచ్చు. ఒరిజినల్ కథలో కంటే భీమ్లా చేసిన మార్పులు అసలు డ్రామా ఫీల్ ను కొంత మిస్సయ్యే అవకాశం ఉంటుంది.
ఇక రానా తన ఆలోచనలతో వచ్చే ఫారెస్ట్ సీన్స్ స్పెషల్ గా ఉన్నాయి. లాడ్జ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే హైలెట్ అయ్యాయి. ఇక హీరోయిన్స్ లలో నిత్యా మీనన్ పాత్ర ఒరిజినల్ క్యారెక్టర్ కంటే ఫైరింగ్ గా ఉండడం విశేషం. ఫైనల్ గా థమన్ ఇచ్చిన సాంగ్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. అయితే అంత ఇష్టం పాటను మాత్రం ఎడిటింగ్ లో తీసేశారు. ఒక విధంగా అది సినిమా స్పీడ్ కు కరెక్ట్ డిసిషన్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
👉పవన్ కళ్యాణ్, రానా రోల్స్
👉ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
👉ప్రీ క్లైమాక్స్
మైనెస్ పాయింట్స్..
👉యాక్షన్ ఎపిసోడ్స్ డోస్
👉ఒరిజినల్ కథలో కంటే కొన్ని మార్పులు
ఫైనల్ గా..
సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ కూడా అంతకుమించి అనేలా కనెక్ట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే సన్నివేశాలు కూడా సినిమాలో చాలానే ఉన్నాయి. ఎక్కడ తగ్గకుండా సినిమా హై వోల్టేజ్ సీన్స్ తో కొనసాగుతుంది. మాస్ ఆడియెన్స్ లో సౌండ్ పెద్దగా ఉండకపోతే విజిల్స్ కు డైలాగ్స్ సరిగ్గా వినిపించకపోవచ్చు. అందుకే సౌండ్ సాలీడ్ గా ఉండే థియేటర్లలో భీమ్లా నాయక్ ను చూడడం బెటర్.
రేటింగ్: 3.50/5
Post a Comment