భీమ్లా నాయక్.. ఏపీలో నష్టాలు తప్పవా?


రానా దగ్గుబాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారి కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం రోజు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు అంతేకాకుండా ఫస్ట్ వీకెండ్ లో టికెట్ల రేట్లు ఇలా అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా టికెట్ల రేట్లు తక్కువగా ఉండడం, బెన్ఫిట్ షోలు కూడా లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమా కోసం ప్రత్యేకంగా పోలీస్ ఫోర్స్ లను కూడా ఏర్పాటు చేసి థియేటర్స్ వద్ద టికెట్ల రేట్లు పెంచకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం విశేషం. ఏ సినిమాకు లేనంతగా భీమ్లా నాయక్ సినిమా కోసమే శుక్రవారం రోజు ఏపీ ప్రభుత్వం కష్టపడడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లోనే రూ.50 కోట్లకి పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం. 

అయితే ప్రస్తుతం ఉన్న పది రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్లతో తో సినిమా బిజినెస్ కొనసాగిస్తే మాత్రం దాదాపు రూ.20 కోట్లకుపైగా నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు కొంత భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఒకవేళ నష్టాలు వస్తే పూరించడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post