మంచు విష్ణు ఆఫీస్ లో చోరీ!


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు టాలీవుడ్ హీరో విష్ణు అఫీస్ లో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.  ఫిల్మ్ నగర్ లోని ఆయన ఆఫీసులో దాదాపు రూ. 5లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీ అయ్యిందట. ఇక ఈ ఘటనపై విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. హెయిర్ డ్రెసర్ నాగ శ్రీనుపైనే తమకు అనుమానం ఉందని మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇక మంచు విష్ణు మా ఎన్నికల్లో గెలిచిన అనంతరం రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. రీసెంట్ గా సన్ ఆఫ్ ఇండియా విషయంలో నెగిటివ్ వార్తలు ప్రచారం చేసిన వారిపై కూడా సీరియస్ అయ్యారు. ట్రోల్స్ చేసే వారిని కూడా వదిలి పెట్టేదిలేదని అన్నారు. ఇక ప్రస్తుతం మంచు విష్ణు శ్రీను వైట్ల దర్శకత్వంలో D అండ్ D అనే ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.


Post a Comment

Previous Post Next Post