సాహో దర్శకుడితో పవన్..?


ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు వచ్చిన వఖిల్ సాబ్ కూడా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ పూర్తిస్థాయిలో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేక పోయింది. ఇక ఈ రెండూ కూడా రీమేక్ సినిమాలే. ఇక రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ మరో రెండు రీమేక్ సినిమాలను లైన్లో పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ అనే తమిళ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఒక టాక్ వచ్చింది. అంతేకాకుండా విజయ్ నటించిన తెరీ సినిమాను కూడా పవన్ తెలుగులో రీమేక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో సాహో దర్శకుడు సూజిత్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉంది. డివివి దానయ్య ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.


Post a Comment

Previous Post Next Post