మహేష్ సినిమాలో హీరో విక్రమ్.. క్లారిటీ వచ్చేసింది


అతడు, ఖలేజా సినిమాల అనంతరం కొన్నేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడో సినిమా చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక మహేష్ బాబు సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు విక్రమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని గత రెండు రోజులుగా ఆన్‌లైన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  

అయితే రీసెంట్ గా విక్రమ్ మేనేజర్ ట్విట్టర్‌లో వార్తలను ఖండించారు. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు మీడియా సంస్థలు క్లారిటీగా తెలుసుకోవాలని కోరాడు. ఇక ఈ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ లేడని తేలిపోయింది. ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.  హారిక & హాసిని క్రియేషన్స్ లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించనున్నారు. సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది.


Post a Comment

Previous Post Next Post