రాధేశ్యామ్ కోసం మహేష్ వాయిస్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మరోసారి మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాకు హిందీలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అమితాబ్ బచ్చన్ ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. 

ఇక తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఫైనల్ గా ఆ విషయంపై దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. మహేష్ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇక ఎవరు వాయిస్ ఇస్తారు అనే విషయంలో కూడా రాధాకృష్ణ సరైన క్లారిటీ ఇవ్వలేదు. మరొక టాక్ ప్రకారం దర్శకుడు రాజమౌళి ప్రభాస్ కోసం రాధేశ్యామ్ కు వాయిస్ ఓవర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post