ప్రభాస్ మూడేళ్ళలో 8 సినిమాలు?


రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా మొదలు పెట్టినా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పక్క ప్లాన్ తో సిద్ధమవుతున్నాడు. ఇక రాబోయే మూడేళ్లలో ప్రభాస్ నుంచి ఏకంగా ఎనిమిది సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ముందుగా మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో చేయబోయే రాజా డీలక్స్ కూడా ఇదే ఏడాది రానుంది.

ఇక 2023 జనవరి 11వ తేదీన ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. ఇక అదే ఏడాది సలార్ సినిమా కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కనుంది కాబట్టి సెకండ్ పార్ట్ కూడా 2023 చివరిలో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు K కూడా అదే ఏడాది వచ్చే ఛాన్స్ ఉంది. ఇక 2024లో సందీప్ వంగా స్పిరిట్ సినిమాతో పాటు సిద్ధార్థ ఆనంద్ తో కూడా ఒక యాక్షన్ సినిమాను తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post