తేడా వస్తే కొట్టే దర్శకుడితో ఉప్పెన బ్యూటీ!


ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న బేబమ్మ కృతి శెట్టి సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పేందుకు ప్రయత్నం చేస్తోంది. నిండా 20 ఏళ్లలోకి రాకముందే కోటిన్నర రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న అమ్మడు ప్రస్తుతం బైలాంగ్యువల్ సినిమాలను కూడా చేస్తోంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మంచి గుర్తింపు తీసుకు రావడంతో తమిళ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి.

ఇక కోలీవుడ్ డిఫరెంట్ డైరెక్టర్ బాల సినిమాలో కూడా వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివ పుత్రుడు, నేనే దేవున్ని, వాడు వీడు, పరదేసి వంటి డిఫరెంట్ సినిమాలు చేసిన బాల విక్రమ్, సూర్య అలాగే చాలామంది నటీనటులను షూటింగ్ స్పాట్ లో కొట్టడమే కాకుండా వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు. ఆ డైరెక్టర్ అంటే అందరికి హడల్. అయినా కూడా ఆయనతో ఇష్టంగా వర్క్ చేయాలని అనుకుంటారు. ఇక ఇప్పుడు సూర్యతో చేయబోయే సినిమాలో కృతిశెట్టి సెలెక్ట్ అయినట్లు సమాచారం. మరి ఆ డైరెక్టర్ తొ అమ్మడు ఎలా వేగుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post