ప్రభాస్ ఈ స్థాయికి పడిపోవడానికి కారణం మీరే!


ప్రస్తుతం 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో మొత్తం 100కోట్ల కలెక్షన్స్ అందుకోవడం కూడా కష్టంగా మారింది. బాహుబలితో వచ్చిన క్రేజ్ తో ఒక్కసారిగా నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కు బడా దర్శకులు నిర్మాతల నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే ప్రభాస్ చేసిన అతిపెద్ద తప్పు యూవీ క్రియేషన్స్ లో ఆ తరువాత రెండు సినిమాలను కాంటిన్యూగా చేయడం. 

సాహో, రాధే శ్యామ్ మంచి సినిమాలా.. కాదా.. అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెడితే ఏ సినిమా అయినా సరే బయ్యర్లకు పెట్టిబడికి నాలుగు రూపాయలు లాభాలు అందిస్తేనే హిట్టయినట్లు లెక్క. సాహో హిందీలో క్లిక్కయినా తమిళ్ మలయాళం కన్నడలో అలాగే తెలుగులో కూడా నష్టాలు వచ్చాయి. కానీ నిర్మాతలు ముందే అమ్ముకొని టేబుల్ ప్రాఫిట్ చూసుకున్నారు. నిండా మునిగింది మాత్రం బయ్యర్లే. రాధే శ్యామ్ విషయంలో ఈసారి హిందీ బయ్యర్ కూడా బ్రతికేలా లేడని అనిపిస్తోంది.

రాధే శ్యామ్ దెబ్బకి ప్రభాస్ హిందీ మార్కెట్ కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభాస్ ను నమ్ముకొని ప్రస్తుతం సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ K, స్పీరిట్ సినిమాలపై నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభాస్ గత రెండు సినిమాల వైఫల్యం తెలుగులో చూపకపోయినా మిగతా భాషల్లో మాత్రం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఏదేమైనా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ రేంజ్ తో రిస్క్ చేసి కేవలం ఓకే ఒక సినిమాతో అనుభవం ఉన్న ఇద్దరు దర్శకులతో సినిమాలు చేసింది. దీంతో కమర్షియల్ గా ప్రభాస్ రేంజ్ తగ్గేలా చేసింది. ఇక ఓ వర్గం ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ ను ట్యాగ్ చేస్తూ దీనికి కారణం మీరే అని  అంటున్నారు.

Post a Comment

Previous Post Next Post