రాజమౌళితో మళ్ళీ ఎప్పుడంటే: ప్రభాస్


బాహుబలి సినిమాతో తన ఐదేళ్ల కెరీర్ ను పణంగా పెట్టిన ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న డార్లింగ్ మళ్ళీ రాజమౌళితో కూడా చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది.

ఇక రీసెంట్ గా ముంబైలో రాధేశ్యామ్ ప్రమోషన్ లో పాల్గొన్న ప్రభాస్ మళ్ళీ రాజమౌళితో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని తప్పకుండా రాజమౌళితో మరో సినిమా చేస్తానని అన్నాడు. ఇదివరకే తాము ఇద్దరం ఒక ప్లాన్ గురించి చర్చించుకున్నట్లు చెప్పిన ప్రభాస్ వర్కౌట్ అయితే త్వరలోనే ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుసగా 8 ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా రాజమౌళి మహేష్ సినిమా అనంతరం ఇంకా ఎవరితో అనేది ఫిక్స్ అవ్వలేదు. మరి వీరి కలయికలో 4వ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post