Aadavallu Meeku Joharlu @ Review


చిరంజీవి (శర్వానంద్) పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ అతని కుటుంబ సభ్యుల కారణంగా చాలా వరకు పెళ్లి చూపులతోనే ప్లాన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి. ఎదో ఒక వంకతో శర్వా కుటుంబంలోని ఆడవాళ్లు అమ్మాయి లోపాలను వెతుకుతూ ఉంటారు. ఇక ఆధ్యా(రష్మీక మందన్న) సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం హీరో ఆమెకు ఎట్రాక్ట్ అవుతాడు. కానీ ఆద్యా తల్లి కుష్బూ వారి ప్రేమ విషయాన్ని వ్యతిరేకిస్తుంది. ఇక ఫైనల్ గా చిరు, అధ్యలు ఎలా ఒకటయ్యారు? ఆడవాళ్ల వలన హీరో పెళ్లి వ్యవహారం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమాలోని అసలు కథ.


విశ్లేషణ:
శర్వానంద్ కెరీర్ మొదటి నుంచి గుడ్ బాయ్ గా ఉండే సినిమాలు చాలా పర్ఫెక్ట్ చేసుకుంటూ రావడంతో అతనికి ఆడవాళ్లు మీకు జోహార్లు అనే కథ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా సినిమాను బాగానే డిజైన్ చేశారు. ఈ సినిమాలో ప్రధానంగా శర్వానంద్ తప్ప మిగతా ప్రధాన పాత్రలన్నీ స్త్రీ పాత్రలే కావడం విశేషం. రాధిక, ఖుష్బూ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇక శర్వా, రష్మిక కెమిస్ట్రీ చాలా బాగుంది.  ముఖ్యంగా రష్మిక సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. ఇక ఉమ్మడి కుటుంబంలో అందరికి ఇష్టమైన చిరంజీవి.. ఎలాగైనా ఆధ్య (రష్మిక)ని పెళ్లి చేసుకోవాలని అనుకోగా,  ఆమె తల్లి (ఖుష్బూ) తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఈ కంటెంట్ తోనే ఫస్ట్ హాఫ్ కలిగి ఉంది. చాలా వరకు రొటీన్ సీన్స్ రెండు కామెడీ సీన్లతో అలా ఫస్ట్ హాఫ్ ముగించేశారు.

సెకండ్ హాఫ్ చిరంజీవి కుటుంబం ఒక ఫైట్ పై ఫోకస్ పెడుతుంది. వారు వ్యాపారవేత్త వకుళ (ఖుష్బూ)ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు. కొన్ని అర్ధవంతమైన డైలాగ్స్ బాగా పనిచేసిన దాని కొనసాగింపు మాత్రం ప్రేక్షకుల అంచనాలను టచ్ చేయలేకపోయాయి. ఒక విధంగా ఈ సీన్స్ ను లేడీస్ అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు అని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ కిషోర్ తిరుమల గతంలో నేను శైలజ, చిత్ర లహరి వంటి సినిమాల తరహాలో మాత్రం రచనలో తన పెన్ పవర్ చూపించలేదు. ఆకర్షణీయమైన సంఘర్షణ పాయింట్ లేదు. రెండు వైపులా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ సినిమాటిక్‌గా కనిపిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి.  నిర్మాత సుధాకర్ చెరుకూరి టెక్నీషియన్స్, నటీనటులు, నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేశారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సరిపోతుంది ఇంకా బాగుండాల్సింది.  దర్శకుడు కిషోర్ తిరుమల ఎలాంటి అలజడి లేకుండా సినిమాను సింపుల్ గానే ఫినిష్ చేశాడు . ఈ తరహా కథలకు ఇంకా బలమైన ఎమోషనల్ సన్నివేశాలు మంచి క్లైమాక్స్ తప్పనిసరి.  కానీ అందులో దర్శకుడు విఫలమయ్యాడు. మొత్తంగా ఇక ప్రేమ పేరుతో ఎలాంటి డోస్ పెంచకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చేసేలా సినిమాను ప్రజెంట్ చేయడం బాగుంది.


ప్లస్ పాయింట్స్
👉మెయిన్ ప్లాట్ క్లీన్ గా ఉండడం
👉కొన్ని కామెడీ సీన్స్
👉శర్వా, రష్మిక కెమిస్ట్రీ

 మైనస్ పాయింట్స్
👉ఎమోషనల్ కంటెంట్ వర్కౌట్ కాలేదు
👉రొటీన్ సీన్స్ ఎక్కువగా ఉండడం

ఫైనల్ గా.. ఆడవాళ్లు జోహార్లు సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయ్యవచ్చు. 

రేటింగ్:  2.75/5

Post a Comment

Previous Post Next Post