రాజమౌళి పిచ్చికి పరాకాష్ట!


దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేయాలని ప్రతీ ఒక్క నటుడికి టెక్నీషియన్ కు ఉంటుంది. కానీ ఆయనతో వర్క్ చేయడం అంత సులువు కాదని ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు చూస్తేనే చాలా క్లారిటీగా అర్థమవుతోంది. నాటు నాటు స్టెప్పు కోసం పర్ఫెక్ట్ గా ఉండాలని 17 సార్లు చేయించి.. చివరికి మళ్ళీ 2వ టేక్ చాలా బాగా వచ్చింది అని దాన్ని ఓకే చేసినట్లు తారక్ చెప్పాడు.

ఇక గతంలో జనవరిలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు ముంబైలో ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన అర నిమిషం షాట్స్ కోసం మళ్ళీ రీ షూట్ చేశారట. ఆ ఈవెంట్ ను లైవ్ కాకుండా ఆ తరువాత టెలికాస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఎంట్రీ సీన్ బాగా రాలేదని లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో మళ్ళీ సెట్స్ వేయించి రీ షూట్ చేశారట. ఇక ఆ రోజుతో రాజమౌళి పర్ఫెక్షన్ పిచ్చి పరాకాష్టకు వెళ్లిపోయినట్లుగా తారక్ సరదాగా చెప్పాడు.


Post a Comment

Previous Post Next Post