హరిహర వీరమల్లు రీలీజ్ డేట్ ఫిక్స్? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

హరిహర వీరమల్లు రీలీజ్ డేట్ ఫిక్స్?


పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, కోవిడ్ తర్వాత ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా అప్పుడు భీమ్లా నాయక్, దాని డబ్బింగ్ షూట్‌ను పవన్ ఇంకా పూర్తి చేయకపోవడంతో మేకర్స్ షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇప్పుడు, పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోదయ సీతమ్ యొక్క సెట్స్‌లో చేరి దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయలని మరో ప్లాన్ వేశాడు. దీంతో హరిహర వీరమల్లు ప్రాజెక్ట్‌ మరింత ఆలస్యం చేశాడు. ఆ రీమేక్ సినిమా పూర్తి కాగానే క్రిష్ కు పూర్తి డేట్స్ కేటాయిస్తాడట. ఇటీవల అందిన సమాచారం ప్రకారం , హరి హర వీర మల్లు చిత్రాన్ని  విడుదల చేయడానికి మేకర్స్ అక్టోబర్ 5ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందో లేదో చూడాలి.