అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు: ప్రభాస్


రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఓ వర్గం అభిమానులతో పాటు ఉప్పలపాటి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 42ఏళ్ళ వయసులోకి వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ పెళ్లి అనే మాట ఎత్తితేనే మళ్ళీ నోరెత్తకుండా ఎదుటి వారికి సమాధానం ఇస్తున్నాడు.

ఇక రీసెంట్ గా రాధేశ్యామ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన డార్లింగ్ పెళ్లిపై ఒక క్లారిటీ ఇవ్వడం విశేషం. ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్‌ తప్పు.. అని రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ లో డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. రియల్‌ లైఫ్‌లో లవ్ మ్యాటర్ లో లెక్క తప్పిందా?' అని ప్రభాస్‌ను ప్రశ్నించాగా.. 'లవ్ మ్యాటర్ లోనే చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నాకింకా పెళ్లి కాలేదు' అని సున్నితంగా జవాబిచ్చారు.

Post a Comment

Previous Post Next Post