బిగ్ బాస్ నాన్ స్టాప్.. లైవ్ ఎందుకు ఆగిపోయింది?


బిగ్ బాస్ నాన్ స్టాప్ ను మొదటిసారి తెలుగులో గట్టిగానే స్టార్ట్ చేశారు. హిందీలో మంచి క్రేజ్ అందుకుంది అని అదే ఫార్మాట్ ను తెలుగు ఓటీటీలో సెన్సార్ లేకుండా స్టార్ట్ చేశారు. ఇక 24 గంటలు లైవ్ స్ట్రీమ్ గత రాత్రి హఠాత్తుగా ఆగిపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.  నిజానికి ఓటీటీ 24 గంటలు చూడడం అనేది కొందరిలో అతిపెద్ద సందేహం. 

డైలీ ఒక గంట చూస్తే ఏం జరుగుతుందో ఒక క్లారిటీ ఉంటుంది. ఇక 24 గంటలు చూడడం అంటే ఎవరి తరం కాదు. అయితే నిన్నటి నుంచి లైవ్ స్ట్రీమ్ ఆగిపోయింది. మళ్ళీ నేడు అర్ధరాత్రి 12 గంటల నుంచి లైవ్ కొనసాగనుందని చెబుతున్నారు. మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఒక కారణం అయితే చెబుతున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే.. నిజానికి షోకు క్రేజ్ ఏ మాత్రం రావడం లేదు. జనాలు అంతగా కనెక్ట్ అవ్వడం లేదని టాక్. అందుకే ఒక రోజు ఆలస్యం చేసి స్క్రిప్ట్ తరహాలో టెలికాస్ట్ చేయాలని చూస్తున్నారట. గతంలోనే స్క్రిప్ట్ అని అర్థమైంది. ఇక 24 గంటలకు ఎలాంటి స్క్రిప్ట్ ప్లాన్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post