రాధే శ్యామ్ సినిమా సోమవారం నాటికి ఒక్కసారిగా సింగిల్ డిజిట్ కు పడిపోయింది. అధివారం 10కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా సోమవారం నాటికి కేవలం 2కోట్ల షేర్ కు పడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక 200కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు 76కోట్ల షేర్ సాదించినట్లు సమాచారం. అంటే దాదాపు మరో 125కోట్లు రాబట్టాల్సి ఉంది.
ఈ లెక్కన చూస్తే ఇప్పటివరకు తెలుగు హీరోలలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అత్యధికంగా 66కోట్ల నష్టాన్ని మిగల్చగా.. మహేష్ బాబు స్పైడర్ 60కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. ఇక రాధే శ్యామ్ అజ్ఞాతవాసి రికార్డును బ్రేక్ చేసేలా ఉందని అనిపిస్తోంది. ఒక విదంగా ఇది పాన్ ఇండియా కాబట్టి తెలుగు హీరోలలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అందుకున్న హీరోల లిస్టులో రాధే శ్యామ్ ద్వారా ప్రభాస్ నెంబర్ వన్ స్థానానికి వచ్చే అవకాశం ఉంది.
Follow @TBO_Updates
Post a Comment