RRRలో ఫస్ట్ ఎంట్రీ సీన్ ఏ హీరోదంటే?


ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా RRR మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకవైపు నందమూరి అభిమానులు మరొకవైపు మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటించగా కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. అయితే ఈ ఇద్దరిలో ముందుగా ఇంట్రడక్షన్ సీన్ ఎవరికి ఉంటుంది అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ముందుగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో ఎంట్రీ ఇస్తాడు అని తెలుస్తోంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టైగర్ కు సంబంధించిన హై ఓల్టేజ్ సన్నివేశంతో ఎంట్రీ ఇస్తాడు అని సమాచారం. ఇక ముందు ఎవరు ఎంట్రీ ఇచ్చారు అనే విషయాన్ని మరిచి పోయే విధంగా దర్శకుడు రాజమౌళి ఆ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post