రాధే శ్యామ్.. ఇప్పుడు మళ్ళీ అలా చేస్తే ఏం లాభం?


దర్శకుడు రాధాకృష్ణ మొదటి సినిమా జిల్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ ప్రభాస్ ఆ దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఇక యు.వి.క్రియేషన్స్ కూడా కథాకథనం గురించి పెద్దగా ఆలోచించకుండా రాధే శ్యామ్ కోసం బడ్జెట్ అయితే మంచినీళ్లలా ఖర్చు పెట్టేసింది. ఇక సినిమాకు ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు. 

అసలు సినిమాకు అంత బడ్జెట్ కూడా అవసరం లేదని విమర్శలు కూడా వచ్చాయి. ఇక సినిమా మొత్తానికి మొదటి వారం లోనే కలెక్షన్స్ తగ్గడంతో ఫ్లాప్ అని తేలిపోయింది. ఇక ఇప్పుడు దర్శకుడు మరోసారి సినిమాలోని డిలీటెడ్ సన్నివేశాలను సినిమాలో జత చేసి కొత్తగా విడుదల చేయబోతున్నట్లు గా చెప్పాడు. ఆ సన్నివేశాలు పాత్రల చుట్టూ తిరుగుతాయని చాలా అద్భుతంగా వచ్చినట్లు కూడా రాధాకృష్ణ చెబుతున్నాడు. అయితే దాదాపు సినిమాను థియేటర్స్ లో నుంచి తీసేసే సమయంలో ఈ విధంగా సన్నివేశాలు మళ్లీ జత చేస్తే ఏం లాభం ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post