మహేష్, ప్రభాస్.. RRR కోసం రానట్లే?


దర్శకధీరుడు రాజమౌళి సినిమా ప్రమోషన్ విషయంలో అయితే ఏమాత్రం రెస్ట్ లేకుండా కష్టపడతారు అని ప్రస్తుతం హడావుడి చూస్తేనే అర్థమవుతుంది. గత రెండు వారాలుగా ఇద్దరు హీరోలను కూడా తిప్పిన చోటుకు తిప్పకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ప్రభాస్ మహేష్ బాబులతో కూడా రాజమౌళి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాలి అని మొదట ఆలోచించాడట.

ముందుగా ప్రభాస్ తో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చారుట. కానీ ప్రభాస్ రాధే శ్యామ్ డిజాస్టర్ అవ్వగానే ఇటలీ వెళ్ళిపోయాడు. అంతేకాకుండా కాలికి సర్జరీ కూడా అవసరమని ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు తో కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఉంటుంది అని మొన్నటి వరకు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి రాజమౌళి ఆలోచించినప్పటికీ మళ్లీ ఎందుకో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.  సినిమా విడుదల తర్వాత మహేష్ బాబుతో హీరోలు ఇద్దరుతో ఇంటర్వ్యూ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఆ విషయం పై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

Post a Comment

Previous Post Next Post