బాయ్ కాట్ RRR.. మరో గొడవ మొదలైంది!


పెద్ద సినిమాలు విడుదల సమయంలో ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతూ ఉండడం కామన్. ఇక ఇప్పుడు RRR సినిమాకు కాస్త తక్కువ కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మాత్రం కన్నడ ఇండస్ట్రీ ఒక విషయం వైరల్ గా మారుతోంది. RRR సినిమాను కన్నడ ప్రేక్షకులు ఏమాత్రం చూడరు అని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో నెగిటివ్ ప్రచారాలను కొనసాగిస్తున్నారు.

ఎందుకంటే RRR సినిమాను కర్ణాటకలో ఎక్కువగా తెలుగులోనే విడుదల చేస్తూ ఉండడం విశేషం. అయితే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నడ భాష లోనే ఈ సినిమాని విడుదల చేయాలని శివ రాజ్ కుమార్ కూడా ప్రత్యేకంగా కోరారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. దీంతో అక్కడి ప్రేక్షకులు ఈ విషయంలో తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజమౌళికి శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరో చెప్పినప్పటికీ కూడా ఆయన మాటలు ఏమాత్రం లెక్క చేయడం లేదు అని బాయ్ కాట్ నినాదాన్ని ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 
#BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ మారుమ్రోగి పోయేలా చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post