ఆచార్య వ్యాపారికి లైగర్ హక్కులు!


విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న లైగర్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మోదటిసారి ఈ కాంబో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతోంది. అయితే ఈ సినిమా బిజినెస్ డీల్స్ అన్ని కూడా దాదాపు క్లోజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ గా సినిమా వంద కోట్లకు పైగా లాభాలను అందించిన్నట్లు సమాచారం.

ఇక రీసెంట్ గా లైగర్ తెలుగు హక్కులను కూడా అమ్మేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ తెలుగు రిలీజ్ హక్కులు 75కోట్ల ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఈ హక్కులను వరంగల్ శ్రీను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ డిస్ట్రిబ్యూటర్ ఆచార్య సినిమా నైజాం హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసి ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఇక ఇప్పుడు లైగర్ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేశాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post