మహేష్ బాబు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా రాజమౌళి స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల VFX సూపర్ వైజర్ కమల్ కన్నన్ తో కలిసి ప్రాన్స్ కు చెందిన విఎఫ్ఎక్స్ స్టూడియో ప్రతినిధులతో కలిసి ప్లానింగ్, బడ్జెట్ ఎస్టిమేషన్ గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.
చర్చలైతే సాగినట్లు జక్కన్న ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు కానీ మహేష్ సినిమా కోసమే అని పక్కాగా చెప్పలేదు. కానీ కమల్ కన్నన్ ను వెంట తీసుకు వెళ్లడంటే ప్రాజెక్ట్ అదే అయ్యి ఉంటుంది. ఇక అలాంటి విషయాల్లో అపార అనుభవం ఉన్న బాహుబలి నిర్మాత శోభును తీసుకు వెళ్లి బడ్జెట్ లెక్కలపై కూడా ఒక అవగాహనకు వచ్చివుంటడు. ఇక జక్కన్న ప్లానింగ్ చూస్తుంటే మహేష్ సినిమాలో హై విజువల్స్ గ్రాఫిక్స్ గట్టిగానే ఉంటాయని అనిపిస్తోంది. ఈ ప్లానింగ్ చూస్తే మళ్ళీ మరో మూడేళ్ళ కాలం పాటు మహేష్ బాబును బయటకు వదలకుండా జక్కన్న జైళ్లోనే లాక్ అయ్యేలా ఉన్నాడని టాక్ అయితే వస్తోంది. సినిమా రావాలి అంటే 2025 వరకు వేయిట్ చేయలేమో?
Follow @TBO_Updates
Post a Comment