గోపి.. ఇంతకంటే బెటర్ ఛాన్స్ ఉండదయ్యా?


మ్యాచో హీరో గోపిచంద్ సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. అతని చివరి నాలుగైదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ తిన్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. పేరుకు మాస్ హీరో అయినా కనీసం 20 కోట్ల మార్కెట్ కూడా కష్టమైంది. అయితే ఈ సమయంలో గోపిచంద్ కు ఒక మంచి అవకాశం వచ్చింది. 

మారుతి దర్శకత్వంలో చేసిన పక్కా కమర్షియల్ సినిమాకు అన్ని వైపులా మంచి దారులు ఓపెన్ అయ్యాయి. మెగాస్టార్ ఈవెంట్ కు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫోకస్ పడింది. అంతేకంటే ముందు ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. మారుతి డైరెక్షన్, యూవీ క్రియేషన్స్ GA2 కాంబోలో రిలీజ్ అలాగే పోటీగా పెద్ద సినిమలేమి లేవు. ఈ తరుణంలో సినిమాకు మంచి టాక్ వస్తే గోపిచంద్ కెరీర్ బిగ్ హిట్ అందుకోవడం పక్కా. మరి పక్కా కమర్షియల్ ఎంతవరకు మెప్పోస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post