గోపిచంద్ మలినేని - మారుతి కలయికలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల సెన్సార్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. 2గంటల 32 నిమిషాల నిడివితో వస్తున్న ఈ సినిమాలో మారుతి టైమింగ్ కామెడీ, కొత్త తరహా కోర్ట్ డ్రామా, గోపిచంద్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీతో కథను కనెక్ట్ చేసి అనంతరం యాక్షన్ డ్రామాలో గోపిచంద్ మార్క్ ఫైట్స్ ఉంటాయట. ఇక సెకండ్ హాఫ్ కోర్ట్ డ్రామాతో ఒక కొత్త పాయింట్ హైలెట్ చేయనున్నారట. మారుతి ఈసారి చిన్న పాయింట్ కాకుండా ఒక పెద్ద విషయాన్ని చెప్పబోతున్నాడట. ముఖ్యంగా కోర్టులో ఉండే సీన్స్ కొన్ని చివరలో అద్భుతంగా ఉంటాయట. సత్య రాజ్, రావు రమేష్ , సప్తగిరి హీరోయిన్ రాశి ఖన్నా పాత్రలు విభిన్నంగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. మరి సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment