45 కోట్ల టార్గెట్.. ది వారియర్ కష్టమే?


రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా ఈనెల 14వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. అయితే ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గానే ఉన్నాయి. రామ్ కెరీర్ లోనే దివారియల్ సినిమా అత్యధికంగా 45 కోట్ల బిజినెస్ అయితే చేసింది. 

ప్రస్తుతం అయితే సినిమాకు సోషల్ మీడియా హడావుడిని బట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. కానీ అనుకున్నంత స్థాయిలో అయితే ఈ సినిమాకు ఓపెనింగ్స్ దక్కే అవకాశం కనిపించడం లేదు. ఒకవైపు వర్షాలు పడుతూ ఉంటే మరొకవైపు టికెట్ల రేట్లు కూడా ఎక్కువగానే ఉండడంతో ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కష్టమే అనిపిస్తుంది. 45 కోట్ల టార్గెట్ అంటే రెండు రోజుల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ హై లో ఉంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంటుంది. మరి ఇలాంటి కష్ట సమయంలో సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post