ప్రభాస్ తో మ్యాడ్ మ్యాక్స్.. గుప్తనిధులు: కృష్ణవంశీ


గులాబీ, నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, చందమామ, మహాత్మా ఇలా ఎన్నో పవర్ఫుల్ కంటెంట్ సినిమాలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆ తరువాత కొన్ని అపజయాల కారణంగా స్లో అయ్యారు. అయినప్పటికీ కమర్షియల్ ట్రాక్ లో కాకుండా డిఫరెంట్ కంటెంట్ తోనే ఆకట్టుకోవాలి అని రంగమార్తాండ అనే సినిమా చేశారు. ఈ సినిమా త్వరలోనే రానుంది.

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ప్రభాస్ తో చేయాలనుకున్న ఒక సినిమా గురించి చెప్పారు. ప్రభాస్ తో మ్యాడ్ మ్యాక్స్ లాంటి సీరీస్ తరహాలో ఒక గుప్తనిధుల కాన్సెప్ట్ లో సినిమా చేయాలని అనుకున్నాడట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథ చెప్పారట. అయితే అందరూ యాక్షన్ కథలు చెబుతున్నారని పర్ఫెమెన్స్ ఎమోషనల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయాలని ఉన్నట్లు ప్రభాస్ కోరడంతో చక్రం అనే సినిమా తీసినట్లు కృష్ణవంశీ చెప్పారు.

Post a Comment

Previous Post Next Post