ది వారియర్ సెన్సార్ రిపోర్ట్


రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. లింగస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా మొత్తం గా రెండు గంటల 35 నిమిషాలు నిడివితో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో యాక్షన్స్ సీన్స్ బలంగా ఉండడంతో U/A సర్టిఫికెట్  ఇచ్చారు.

ఇక సినిమా ఎలా ఉంది అనే టాక్ లోకి వెళితే.. కథలో అయితే కొత్తగా ఏమీ ఉండదు అని తెలుస్తోంది. రొటీన్ గానే పోలీస్ పాత్రతో విలన్స్ ను ఎదిరించడం ఆ తర్వాత విలన్ ఇంటర్వెల్ బ్లాక్ లో దెబ్బ కొట్టడం ఆ తర్వాత హీరో ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడు.. చివరలో ఒక మంచి సందేశంతో విలన్ ను ఎలా మట్టుబెట్టాడు అనే తరహాలో కథ కొనసాగుతుందట. ఇక ఆది పినిశెట్టి నటన అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫైట్స్ కూడా మాస్ ఆడియెన్స్ విజిల్స్ వేయించేలా ఉంటాయట. 2 పాటలు స్క్రీన్ పైన చాలా బాగుంటాయి అని తెలుస్తోంది
.

Post a Comment

Previous Post Next Post