అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప సినిమాను మొదట కేవలం ఒక పార్ట్ లోనే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత నిడివి ఎక్కువైందని రెండు భాగాలుగా తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. అయితే ఫస్ట్ పార్ట్ షూట్ ఫినిష్ అయినప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన 70% షూట్ కూడా ఫినిష్ అయ్యింది.
అయితే పుష్ప భారీ స్థాయిలో సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ది రూల్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో చాలా వరకు మళ్ళీ రీ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కొన్ని ఎపిసోడ్స్ కూడా చేంజ్ చేయాలని స్క్రిప్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ కానుంది. అయితే ఇంతకుముందు షూట్ కోసం దాదాపు 30 కోట్లు వృధా అయినట్లే అనిపిస్తోంది. సాధారణంగా సుక్కు ఎలాంటి సినిమా చేసిమా సగం వరకు ఎడిట్ లోనే పోతుంది. మరి త్వరలోనే స్టార్ట్ చేయబోయే షూటింగ్ కోసం ఇంకెంత డబ్బును ఖర్చు చేస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment