అవతార్ 2 రైటర్ అవసరాల.. ఎలా సెలెక్ట్ అయ్యడంటే?


జేమ్స్ కామెరూన్ అవతార్ 2 సినిమా డిసెంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మొత్తంగా ఈ సినిమాను 160 భాషల్లో విడుదల చేస్తున్నారు. తప్పకుండా మొదటి రోజే ఊహించని రేంజ్ లో భారీ ఓపెనింగ్స్ అందుకుంటుంది అని అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఇండియాలో కూడా భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడుతోంది.


తెలుగులోనే సినిమా 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ డైలాగ్స్ ప్రముఖ నటుడు రచయిత దర్శకుడు శ్రీనివాస్ అవసరాల అందించబోతున్నాడు. అతను ఇంతకుముందు ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇంత పెద్ద సినిమాకు అతను ఎలా సెలెక్ట్ అయ్యాడు అంటే ఇది కేవలం డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచన మాత్రమే కాదు. అవతార్ సినిమాను ఏ భాషలో విడుదల చేయాలన్న కూడా జేమ్స్ కామెరూన్ టీమ్ ప్రమేయం లేకుండా డబ్బింగ్ పనులు జరగవు.

Also read: ఉపాసన ప్రెగ్నెన్సీ.. ఇన్నేళ్ళ తరువాత ఎందుకంటే!

కేవలం డబ్బింగ్ కోసమే ప్రొడక్షన్ హౌస్ ఒక టీమ్ ని సెట్ చేస్తుంటారు. డైలాగ్స్ వెర్షన్స్ రాసే ఎవరైనా సరే అవతార్ కు సంబంధించిన టీమ్ తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ అయినా సరే వారు ఓకే చేయకుండా ఫిక్స్ చేయరు. ఇక ముందుగా డబ్బింగ్ వెర్షన్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఒకరిని ఫిక్స్  చేసుకున్న తర్వాత అవతార్ టీం ప్రత్యేకంగా వారిని ఇంటర్వ్యూ కూడా చేస్తుంది.

HIT 2: బాక్సాఫీస్ వద్ద నష్టం తప్పదా?

 ఇక అవసరాల శ్రీనివాస్ ఎలాగూ అమెరికాలో చదువుకున్న అనుభవం ఉంది కాబట్టి అతను ఇంటర్వ్యూలో కూడా అవతార్ టీమ్ ను ఇంప్రెస్ చేసి చాలా ఈజీగా ఛాన్స్ కొట్టేశాడు. పైగా అతనిలో మంచి రచయిత దర్శకుడు కూడా ఉన్నాడు. అందుకే అవతార్ సినిమా కోసం ఇతని డిస్ట్రిబ్యూటర్స్ మొదట సెలెక్ట్ చేసుకోగా అవతార్ టీం ఫిక్స్ చేసింది. ఇక ఇందుకోసం అతను కోటి వరకు రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

5 Comments

  1. Replies
    1. Hello there thanks for spreading this wonderful information about Avatar 2 movie through click the internet. I was waiting for this amazing website blog posts. Thanku you are very good personality.

      Delete

Post a Comment

Previous Post Next Post