కస్టడీ దెబ్బ కొట్టినా స్టార్ హీరో పిలిచాడు!


తమిళ ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున అందుకున్న వెంకట్ ప్రభు ఇటీవల నాగచైతన్యతో కస్టడీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో మళ్ళీ దర్శకుడికి మరో అవకాశం వస్తుందా లేదా అనేంతలో కథనాలు కూడా వెలుపడ్డాయి. అయినప్పటికీ కూడా వెంకట్ ప్రభుకు ఒక స్టార్ హీరో  నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇంతకుముందే వెంకట్ ప్రభు విజయ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు విజయ్ చాలా బిజీగా ఉండడం వలన ఛాన్స్ దొరకలేదు. అయితే ఇప్పుడు కస్టడీ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా విజయ్ వెంకట్ తో సినిమా చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అసలైతే కస్టడీ సినిమా కథను మొదట కార్తీతో చేయాలని అనుకున్నారు. కానీ కార్తీ కూడా అప్పటికి బిజీగా ఉండడం వలన దర్శకుడు వెయిట్ చేయలేకపోయాడు. ఇక నాగచైతన్య ఈ సినిమాను ఓకే చేసి ఇప్పుడు డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి వెంకట్ తన తదుపరి సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

3 Comments

  1. సినిమా సూపర్ ఉంది. బాలేదు అని ఎలా అంటారు

    ReplyDelete
  2. Movie super custody...movie Chudadam rani Prathi edava comments

    ReplyDelete
  3. Movie super undi ఎందుకు ఇలా టాక్ స్ప్రెడ్ చేశారో అర్థం కాలేదు

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post