రామ్ కోసం అంత బడ్జెట్ అవసరమా?


దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ చిత్రాలను రూపొందించడంలో ఎంతగా తన పని తనాన్ని చూపిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే గత కొంతకాలంగా అతని విజయాలు తరచుగా ఫ్లాప్‌లతో కలిసిపోయాయి. ఒక సక్సెస్ వస్తే వెంటనే డిజాస్టర్ ఎదురవుతోంది. గత చిత్రం 'అఖండ'పై భారీ విజయాన్ని అందుకోవడం వలన ఇప్పుడు అందరి దృష్టి ఆయన రాబోయే ప్రాజెక్ట్ 'BoyapatiRapo'పై పడింది.

అయితే ఈ దర్శకుడు 'అఖండ' తరహాలోనే మరోసారి బడ్జెట్ ఆందోళనలతో మల్లగుల్లాలు పడుతున్నట్లు కనిపిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో సినిమా కాబట్టి అఖండ బడ్జెట్ పెరిగినప్పటికి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. కానీ రామ్ సినిమా విషయానికి వస్తే రూ.30 కోట్ల బడ్జెట్‌తో పాన్-ఇండియన్ స్టార్‌గా మార్చాలనే దర్శకుడు రిస్క్ తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. షూటింగ్ స్టార్ట్ అయ్యాక లెక్క రూ. 50 కోట్లకు చేరిందట. 

బడ్జెట్ ఈ పరిమితిని ఇంకాస్త దాటే అవకాశం లేకపోలేదు.  ఈ చిత్రం బలమైన యాక్షన్ సన్నివేశాలకు హామీ ఇచ్చినప్పటికీ వాటిని అందించాలనే బోయపాటి సంకల్పం హద్దులు దాటుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే 'ది వారియర్', 'కస్టడీ' వంటి చిత్రాలతో నష్టాలను ఎదుర్కొన్న నిర్మాత శ్రీనివాసకు ఈ బడ్జెట్ విషయం మరో టెన్షన్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post