2025 సంక్రాంతి: రేసు ఎలా ఉండబోతోందో తెలుసా?


టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. పెద్ద సినిమాలతో పాటు ఒకటి రెండు చిన్న సినిమాలు విడుదల అవుతాయి. 2025 సంక్రాంతికి కూడా మేకర్స్, హీరోలు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు. ఈసారి పెద్ద సినిమాలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా "విశ్వంభర" తో 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. "బింబిసార" దర్శకుడు వశిష్ఠ సాయంతో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.


దిల్ రాజు తన బ్యానర్ నుండి వచ్చే సంక్రాంతికి ఒక సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించనున్న సినిమా కూడా ఈ లిస్టులో ఉందని సమాచారం. రవితేజ తన 75వ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీ లీల హీరోయినుగా నటిస్తున్న ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. మేకర్స్ ఈ సినిమాను బిగ్గెస్ట్ రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారు. అలాగే తేజ సజ్జా నటిస్తున్న "మిరాయ్" కూడా సంక్రాంతికి విడుదల కానుంది.

"హనుమాన్" సీక్వెల్, "అఖండ" సీక్వెల్, "బంగార్రాజు" సీక్వెల్ లు కూడా సంక్రాంతి సీజన్ లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" 2024లో కాకుండా 2025 సంక్రాంతికి విడుదలవుతుందనే ప్రచారం ఉంది, కానీ దీనిపై ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. సంక్రాంతి విడుదలలను చూస్తే నాలుగు సినిమాలు ఇప్పటివరకు ఖరారు అయ్యాయి. వీటికి ఇంకా ఎన్ని సినిమాలు జత అవుతాయో, ఎన్ని సినిమాలు చివరికి వాయిదా పడతాయో చూడాలి. 

Post a Comment

Previous Post Next Post